CM Revanth Reddy : హైదరాబాద్ – ఉస్మానియా యూనివర్శిటీకి ఘనమైన చరిత్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే అది ప్రపంచంలోనే పేరు పొందిన స్టాన్ ఫోర్డ్, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలతో పోటీ పడనుందన్నారు. ఇక్కడ చదువుకున్న వారు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీలలో ఉన్నతమైన స్థానాలలో ఉన్నారని ఆ విషయం విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇదిలా ఉండగా సీఎం ఉస్మానియా యూనివర్శిటీలో దుందుభి, భీమా హాస్టళ్లతో పాటు ర. 90 కోట్ల విలువైన భవనాలను ప్రారంభించారు. డిజిటల్ లైబ్రరీ, ఆధునిక రీడింగ్ రూమ్‌కు శంకుస్థాపన చేశారు.
CM Revanth Reddy Key Comments on OU
నియా విశ్వ విద్యాలయానికి గత వైభవం తీసుకు వస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). స్టాన్‌ఫోర్డ్ మరియు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల వంటి ప్రపంచ స్థాయి సంస్థలతో సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. విశ్వ విద్యాలయాన్ని తెలంగాణ ఆత్మగా భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం, విద్యా పరంగా , మౌలిక సదుపాయాల పరంగా సంస్థను బలోపేతం చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికలను రూపొందించిందని ఆయన అన్నారు. రూ. 3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో తమ సర్కార్ వచ్చాక ఉస్మానియా విశ్వ విద్యాలయానికి రూ. 1,000 కోట్లు మంజూరు చేయడం భారం కాదని ప్రకటించారు.
ప్రభుత్వం ఒక సంవత్సరంలో విద్య కోసం రూ. 40,000 కోట్లు ఖర్చు చేసిందని, 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు రూ. 20,000 కోట్లు ఆమోదించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. OU పరివర్తనకు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయడానికి, ప్రతిపాదనలను రూపొందించడానికి ఇంజనీర్ల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్ట్స్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించడానికి, కొత్త నిధులను ప్రకటించడానికి క్యాంపస్‌కు తిరిగి వస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. పోలీసులను మోహరించబోమని ప్రకటించారు.
Also Read : Minister Atchannaidu Promise Interesting : ఎరువుల కొరత లేకుండా చేస్తాం : అచ్చెన్న
