CM Revanth Reddy Important Update : డిసెంబ‌ర్ లో రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ : సీఎం

ప్ర‌క‌టించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి

Hello Telugu - CM Revanth Reddy Important Update

Hello Telugu - CM Revanth Reddy Important Update

CM Revanth Reddy : న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ ప్ర‌భుత్వం అన్ని రంగాల‌లో అభివృద్ది సాధించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన యూఎస్ఐఎస్పీఎఫ్ వార్షిక స‌మావేశం జ‌రిగింది. సీస్కో మాజీ సీఈఓ జాన్ ఛాంబ‌ర్స్, యుఎస్ ఇండియా స్ట్రాట‌జిక్ పార్టనర్‌షిప్ ఫోరం (USISPF) నేత‌ల‌ను క‌లిశారు రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా వారితో సంభాషించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. వివిధ కీల‌క అంశాల గురించి చ‌ర్చించామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా స‌మ్మిట్ లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా వ‌చ్చే నెల డిసెంబ‌ర్ 8, 9వ తేదీల‌లో రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

CM Revanth Reddy Comments

ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన స‌ద‌స్సుకు మీరంతా త‌ప్ప‌కుండా హాజ‌రు కావాల‌ని కోరారు సీఎం. త‌మ ఆహ్వానాన్ని యుఎస్ఐఎస్పీఎఫ్ స‌భ్యులు అంగీక‌రించ‌డం ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా మార్చేందుకు రేయింబ‌వ‌ళ్లు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. ఔత్సాహికులు, కంపెనీలు, సీఈఓలు, చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, క‌న్స‌ల్టెంట్లు ఇక్క‌డికి వ‌స్తున్నార‌ని వారికి సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. యుఎస్ఐఎస్పీఎఫ్ ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి , ప్రెసిడెంట్ డాక్ట‌ర్ ముఖేష్ అఘి , స‌భ్యులు తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు చెప్పారు సీఎం.

Also Read : Jubilee Hills By Election Counting Sensational : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ షురూ

Exit mobile version