CM Nitish Kumar : మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. తాజాగా ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మోదీ ఎన్డీయే ఖరారు చేసింది రాధాకృష్ణన్ (CP Radha Krishnan) ను. అపారమైన అనుభవం కలిగిన తనను ఎంపిక చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయనకు జేడీఏ పార్టీ పూర్తి సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ ప్రతిపాదించడాన్ని కూడా మంచి నిర్ణయం అని పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా సీపీకి అభినందనలు తెలియ చేస్తున్నట్లు వెల్లడించారు . ఇదిలా ఉండగా నితీష్ కుమార్ పార్టీకి లోక్ సభలో 12 మంది ఎంపీలు, రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. మొత్తం 16 మంది ఎంపీల బలం ఉంది.
CM Nitish Kumar Approved
సీపీ రాధాకృష్ణన్ అభ్యర్థిగా ప్రకటించారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ సందర్బగా తన ఎంపిక పట్ల బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడా ప్రత్యేకంగా అభినందించారు.ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించినందుకు సి.పి. రాధాకృష్ణన్ కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు కూడా. మీ అనుభవం, అంకితభావం, నాయకత్వం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నిరంతరం ప్రేరణనిస్తాయని స్పష్టం చేశారు సోషల్ మీడియా వేదికగా చౌదరి. రాధాకృష్ణన్ ను ఎన్డీఏ ఎంపిక చేయడం విస్తృత మద్దతును ఏకీకృతం చేసే లక్ష్యంతో తీసుకున్న చర్యగా భావించ బడింది, జెడి(యు) వంటి మిత్రదేశాలు బహిరంగంగా తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి.
భారత ఉప రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు.
ప్రస్తుతం, సంఖ్యా బలం ఎన్డీఏకు అనుకూలంగా ఉంది. రెండు సభల ఉమ్మడి బలం 786 మంది సభ్యుల బలం కలిగి ఉంది పార్లమెంట్. విజయం సాధించడానికి అభ్యర్థికి కనీసం 394 ఓట్లు కావాల్సి ఉంటుంది.
Also Read : AP & Telangana Govt Holidays Interesting : సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు
