CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక ప్రకటన చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని అన్నారు. ఇందుకోసం ఈ ఏడాది వెయ్యి కోట్లు, వచ్చే ఏడాది మరో వెయ్యి కోట్లు ఇస్తామన్నారు. అటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. ఇలా రెండు వైపులా పంపులతో విశాఖ నగరానికి ఈ ప్రాజెక్టులు విస్తరించాలని స్పష్టం చేశారు.. వంశధార, నాగావళి, చంపావతి అనుసంధానం చేస్తూ ఈ ప్రాంతంలోని అన్ని రిజర్వాయర్లు నింపడం ద్వారా ఉత్తరాంధ్రలో వాటర్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం ఇది ఉత్తరాంధ్ర నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని చెప్పారు. ఏలేరు పూర్తిగా నింపాలన్నారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీటిని తరలించడానికి ఏలేరు ఎంతో కీలకం అని అన్నారు.
CM Chandrababu Key Comments
హెడ్ వర్క్స్ మినహా వరికపూడిసెల ఫేజ్ 1లో మిగిలిన అన్ని పనులు పూర్తి చేసి 24,900 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేందుకు సిద్ధం చేయాలని నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే ఫేజ్ 2 పనులకు సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చే ఏడాది జనవరి నాటికల్లా సాధించాలని ఆదేశించారు. రెండు దశలు పూర్తి చేయడానికి రూ.1,925 కోట్లు వ్యయం కానుండగా, 84,281 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. గతేడాదికన్నా ఈ ఏడాది రాష్ట్రంలో 1.25 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి సగటు భూగర్భ జలాలు 8.43 మీటర్లుగా ఉన్నాయన్నారు. భూగర్భజలాలు 8 మీటర్ల కంటే దిగవకు ఉన్న 7,762 గ్రామాల్లో వాటి పెంపునకు ఫామ్ పాండ్స్, చెక్ డ్యామ్‌ల నిర్మాణం వంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
Also Read : KTR Award Interesting : కేటీఆర్ కు గ్రీన్ లీడర్‌షిప్ అవార్డ్
