CM Chandrababu : అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి అడ్వైజర్ గా రామ్ దేవ్ బాబా ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఒకవేళ ఆయన అంగీకరిస్తే ఇప్పుడే తాము నియమించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. తానే కాదు యావత్ ఏపీ రాష్ట్ర ప్రజలంతా తనకు ధన్యవాదాలు తెలియ చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నారని, కానీ ద బెస్ట్ సెలబ్రిటీ మాత్రం బాబా రామ్ దేవ్ మాత్రమేనని స్పష్టం చేశారు సీఎం.
CM Chandrababu Invites
శుక్రవారం ఏపీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో (CM Chandrababu) పాటు పతంజలి సంస్థ ఫౌండర్ , చైర్మన్, ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబాతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం. తనకు గత కొన్నేళ్లుగా రామ్ దేవ్ బాబాతో పరిచయం ఉందన్నారు. తనకు ముందుచూపు ఎక్కువ అని పేర్కొన్నారు.
ఒక్క పతంజలి ద్వారా అతి తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులను అందించడం మామూలు విషయం కాదన్నారు. ప్రత్యేకించి యోగాను విశ్వ వ్యాప్తం చేయడంలో రామ్ దేవ్ బాబా కీలక పాత్ర పోషించారని ప్రశంసలు కురిపించారు. ఆయన అనుభవం తమ రాష్ట్రానికి, ప్రభుత్వానికి చాలా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. తాను కావాలని రామ్ దేవ్ బాబాను సలహాదారుగా ఉండాలని కోరుతున్నానని సభా ముఖంగా ప్రకటించడంతో అందరూ విస్తు పోయారు. దీనికి సంతోషం వ్యక్తం చేశారు రామ్ దేవ్ బాబా.
Also Read : Mallikarjun Kharge Shocking Comments : పొంగులేటి వ్యవహారం ఖర్గే ఆగ్రహం
