AP Rains : అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఏపీ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ ఎత్తున వర్షాలు (AP Rains) కురుస్తాయని తెలిపారు మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందన్నారు. మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.
AP Rains Warning
మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని , ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ప్రత్యేకంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ల వద్దంటూ కోరారు. వర్షాలు పడే సమయంలో చెట్ల వద్ద, శిథిలాల భవనాల వద్ద నిల్చోవద్దని సూచించారు ఎండీ ప్రఖర్ జైన్. చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండ రాదని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొంగిపోర్లే వాగులు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.
Also Read : CM Chandrababu Huge Support : మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల పరిహారం
