CM Chandrababu : అమరావతి : ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). శుక్రవారం ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. గొట్టా బ్యారేజ్ క్యాచ్ మెంట్లో 33 టీఎంసీలు, తోటపల్లి పరిధిలో 11 టీఎంసీలు మేర వర్షపాతం నమోదు అయ్యిందని తెలిపారు అధికారులు. గొట్టా బ్యారేజికి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందన్నారు శ్రీకాకుళం కలెక్టర్ .ఒడిస్సాల్లోని ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని చెప్పారు.
CM Chandrababu Key Comments
భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. విశాఖ నగరం కంచరపాలెం లో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షం లేదని…ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో నదుల్లో వరద ఉందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలాయని, ఇప్పటికే 90 శాతం కూలిన చెట్లను తొలగించామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 90 శాతం మేర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్టు వెల్లడించారు ఈపీడీసీఎల్ అధికారులు. ఇవాళ సాయంత్రం లోగా అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ పునరుద్ధరించాలని ఆదేశించారు.
Also Read : AP Teachers Special Training Interesting : ఏపీలో నూతన టీచర్లకు ప్రత్యేక శిక్షణ
















