CM Chandrababu Interesting Comments : పిలిస్తే ప‌లికే అన్న‌లు ఆటో డ్రైవ‌ర్లు : సీఎం

ఆటో డ్రైవ‌ర్ సేవ‌లో ప‌థ‌కం ప్రారంభం

Hello Telugu - CM Chandrababu Interesting Comments

Hello Telugu - CM Chandrababu Interesting Comments

CM Chandrababu : విజ‌య‌వాడ : స‌మాజంలో ఆటో డ్రైవ‌ర్ల పాత్ర గొప్ప‌ద‌ని కొనియాడారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు . శ‌నివారం విజ‌య‌వాడ‌లో ఆటో డ్రైవ‌ర్ సేవ‌లో నూత‌న ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబుతో పాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌, మంత్రి నారా లోకేష్ , ఎంపీ కేశినేని చిన్ని హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్బంగా జ‌రిగిన స‌మావేశంలో చంద్ర‌బాబు (CM Chandrababu) ప్ర‌సంగించారు. తాము ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీలో భాగంగా ఇవాళ ఆటో డ్రైవ‌ర్ల‌కు ఆర్థిక సాయం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఆటో డ్రైవర్లు నవ్వుతూ పలకరిస్తారని అన్నారు. గ్రామస్థాయి నుంచి దేశ రాజకీయాలన్నీ ఆటో డ్రైవర్లే చర్చిస్తుంటారని చెప్పారు.

CM Chandrababu Comments

ఆనాడు ఎన్టీఆర్‌ ఖాకీ డ్రెస్సు వేసుకుని చైతన్యరథంపై పర్యటించారని గుర్తు చేశారు. ఆటోల వెనుక ఉన్న కొటేషన్లు చదువుతూ ఉంటాన‌ని అన్నారు సీఎం. వారి కొటేషన్లు చూస్తుంటే వారి మనస్సు ఏంటో అర్ధమవుతోందని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు. ఆటోలో ఏ వస్తువు మరచి పోయినా పోలీసులకు ఇస్తారని, ఎన్ని సమస్యలు ఉన్నా ఆటో డ్రైవర్లు నవ్వుతూ ఆదరిస్తారని ప్ర‌శంస‌లు కురిపించారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని రకాల ఛార్జీలు వేసి డ్రైవర్లపై భారం మోపారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగానే గ్రీన్‌ ట్యాక్స్‌ను తగ్గించామ‌ని ప్ర‌క‌టించారు సీఎం. రూ.2 వేల కోట్లు ఖర్చుపెట్టి రోడ్లపై గుంతలకు మరమ్మతులు చేశామ‌న్నారు.

Also Read : Zubeen Garg Death Mystery : జుబీన్ గార్గ్ మృతిపై జ్యుడీషియల్ క‌మిష‌న్

Exit mobile version