Zubeen Garg Death Mystery : జుబీన్ గార్గ్ మృతిపై జ్యుడీషియల్ క‌మిష‌న్

ఏర్పాటు చేసిన అస్సాం సీఎం హిమంత శ‌ర్మ

Hello Telugu - Zubeen Garg Death Mystery

Hello Telugu - Zubeen Garg Death Mystery

Zubeen Garg : అస్సాం : అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిస్వా శ‌ర్మ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇటీవ‌లే సింగ‌పూర్ లో అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు రాష్ట్రానికి చెందిన భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg). ఆయ‌న అంతిమ యాత్ర‌కు వేలాది మంది త‌ర‌లి వ‌చ్చారు. ప్ర‌భుత్వం ఆయ‌న‌కు సంతాప సూచ‌కంగా అధికార‌కంగా అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించింది. ఇదిలా ఉండ‌గా జుబీన్ గార్గ్ మృతిపై ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేశారు. సీఐడీ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని గార్గ్ స‌తీమ‌ణి కోరారు. ఈ త‌రుణంలో ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది శ‌నివారం. జ్యుడీషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్ర సైకియా నేతృత్వంలోని ఈ కమిషన్ ఆరు నెలల్లోపు తన నివేదికను సమర్పించాల‌ని ఆదేశించింది.

Zubeen Garg Death Mystery

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ అస్సాంలోని జోర్హాట్‌లో గాయకుడు జుబీన్ గార్గ్‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. గాయకుడు-స్వరకర్త జుబీన్ గార్గ్ మరణంపై దర్యాప్తునకు అస్సాం ప్రభుత్వం ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని అధికారిక ఉత్తర్వులో పేర్కొంది. సెప్టెంబర్ 19న సింగపూర్‌లో గార్గ్ మరణానికి దారితీసిన వాస్తవాలు, పరిస్థితుల‌పై కమిషన్ దర్యాప్తు చేస్తుందని స్ప‌ష్టం చేసింది. గాయకుడి మరణానికి సంబంధించి ఏదైనా వ్యక్తి, అధికారం లేదా సంస్థ నుండి ఏవైనా లోపాలు, తప్పిదాలు లేదా కమిషన్ లేదా నిర్లక్ష్యం ఉన్నాయా అని కూడా ఏకసభ్య ప్యానెల్ దర్యాప్తు చేస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది.

Also Read : Hindustan Company New Innovation : ద కింగ్ అంబాసిడ‌ర్ ఈజ్ బ్యాక్

Exit mobile version