CM Chandrababu Interesting Comments : దైవ స్వ‌రూపం భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

Hello Telugu - CM Chandrababu Interesting Comments

Hello Telugu - CM Chandrababu Interesting Comments

CM Chandrababu : శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని ప్ర‌శంస‌లు కురిపించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). బుధ‌వారం పుట్ట‌ప‌ర్తిలోని ప్ర‌శాంతి నిలయంలో జ‌రిగిన భ‌గ‌వాన్ సాయి బాబా శ‌తాబ్ది ఉత్స‌వాల‌లో ముఖ్య అతిథులుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, న‌టి ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్, భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ స‌చిన్ టెండూల్క‌ర్ , డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లతో క‌లిసి పాల్గొన్నారు సీఎం. ఈ సంద‌ర్బంగా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌సంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపంగా నిలిచార‌ని చెప్పారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేది శ్రీసత్యసాయి మనకు చూపిన దారి అని అన్నారు. దానిని ప్ర‌తి ఒక్క‌రు ఆచ‌రించాల‌ని పిలుపునిచ్చారు.

CM Chandrababu Comments on Sri Sathya Sai Baba

విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారని కొనియాడారు నారా చంద్ర‌బాబు నాయుడు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో ఇవాళ ఆయన శతజయంతి వేడుకలు జరుపు కోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. బాబా మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు…ఆచరించారు. ఫలితం చూపించారని అన్నారు సీఎం. ప్రేమ ఒక్కటే మతం, హృదయం ఒక్కటే భాష, మానవత్వమే కులం, అన్నిచోట్లా దైవం ఉందని బోధించారని గుర్తు చేశారు. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మికత వైపు నడిపించారు. వేర్వేరు దేశాలు వేర్వేరు ప్రాంతాల ప్రజలను మనో దర్శనంతో ప్రభావితం చేశారంటూ కొనియాడారు నారా చంద్ర‌బాబు నాయుడు. మానవ సేవే మాధవ సేవ అనే ఆయన భావనతో శ్రీసత్యసాయి భక్తులు మానవాళికి సేవలు అందిస్తున్నార‌ని కొనియాడారు.

Also Read : PM Modi Important Commments : ప్రేమ‌కు, సేవ‌కు ప్ర‌తిరూపం శ్రీ స‌త్య‌సాయి బాబా

Exit mobile version