CM Chandrababu : కడప జిల్లా – మాజీ సీఎం జగన్ రెడ్డిపై భగ్గుమన్నారు. తను ఘరానా మోసగాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన ఐదేళ్ల పాలనా కాలంలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని వాపోయారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి అందినంత మేర దోచుకున్నాడని ధ్వజమెత్తారు. తాము వచ్చాక ఏపీ అభివృద్దిలో ముందుకు వెళుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. పవర్ లూమ్స్ ఉన్నవారికి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్ ఉన్నవారికి 200 యూనిట్ల మేర విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ప్రకటించారు.
CM Chandrababu Slams YS Jagan
ఈనెల 7వ తేదీన అంతర్జాతీయ చేనేత దినోత్సవం రోజు నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు, రాష్ట్ర బ్రాండ్ పెంచేందుకు సింగపూర్ వెళ్లొచ్చాననని చెప్పారు. నేను ఎక్కడ ఉన్నా ఒకటో తేదీన పేదల సేవలో పాల్గొనేలా చూసుకుంటున్నానని అన్నారు. అవసరమైతే నా కార్యక్రమాలు వాయిదా వేసుకుంటానని అన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏదో మొక్కుబడిగా కాకుండా ఒక బాధ్యతగా చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి రూ.33 వేలకోట్లు వెచ్చిస్తున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెన్షన్ల కోసం ఇంతపెద్ద మొత్తంలో ఖర్చు చేసేది ఏపీనేనని అన్నారు.
మన రాష్ట్రం తర్వాత తెలంగాణ రూ. 8,170 కోట్లు, కేరళ రూ. 7,295 కోట్లు, హర్యానా రూ.7,194 కోట్లు, వెస్ట్ బెంగాల్, 5,460 కోట్లు, రాజస్థాన్, రూ.5,160 కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నారని తెలిపారు సీఎం. 1,08,499 మందికి కొత్తగా వితంతు పెన్షన్లు ఇచ్చేందుకు రూ.43.40 కోట్లు విడుదల చేశామని ప్రకటించారు. రెండు నెలల పాటు పింఛన్లు తీసుకోకపోయినా మూడు నెలలో కలిపి ఒకేసారి ఇస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో ఉన్న 14,703 మందికి, వృద్ధాశ్రమాల్లో ఉన్న 20,587 మందికి, ఒక సచివాలయ పరిధి నుంచి మరో సచివాలయ పరిధికి వెళ్లిన 31,496 మందికి, హాస్టళ్లలో ఉంటున్న దివ్యాంగ విద్యార్థులకు 3,683 మందికి ఇస్తున్నట్లు తెలిపారు. ఇవి కాకుండా ఈ నెల నుంచి కొత్తగా 1.09 లక్షల మందికి స్పౌజ్ ఫించన్లు అందిస్తున్నామని, దీనికోసం రూ.520 కోట్లు ఖర్చు పెడుతున్నామని సీఎం వివరించారు.
Also Read : Jajula Srinivas Shocking Comments : తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ పోరాటం
