Jajula Srinivas Shocking Comments : తెలంగాణ ఉద్య‌మం త‌ర‌హాలో బీసీ పోరాటం

కేంద్ర మంత్రుల ప‌ర్య‌ట‌నల‌ను అడ్డుకుంటాం

Hello Telugu - Jajula Srinivas Shocking Comments

Hello Telugu - Jajula Srinivas Shocking Comments

Jajula Srinivas : బీసీ రిజ‌ర్వేష‌న్ల బిల్ల‌ను తక్ష‌ణ‌మే ఆమోదించాల‌ని లేక పోతే కేంద్ర మంత్రుల‌ను అడ్డుకుని తీరుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas). బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గల్లీలో కాదు ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీ దిగి రాకపోతే ఆగస్టు రెండో వారంలో రాష్ట్రంలో సడక్ బంద్ నిర్వహిస్తామ‌ని ప్ర‌క‌టించారు. బిఆర్ఎస్ బీసీ గర్జనలో బిసి రిజర్వేషన్లు తగ్గించినందుకు బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా బీసీని చేస్తామని బీసీ గర్జన సభలో కెసిఆర్ ప్రకటించాల‌న్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని చేపడతామ‌న్నారు. రిజర్వేషన్ వ్యతిరేక పార్టీలకు హటావో… బిసి రిజర్వేషన్లకు బచావో ఉద్యమం ఉదృతం చేస్తామ‌ని వార్నింగ్ ఇచ‌చ్చారు.

Jajula Srinivas Goud Shocking

కాకతీయ యూనివర్సిటీ లో జరిగిన బీసీ మేధావుల సదస్సులో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ద్రోహు్లెవరో, దోస్తులేవరో త్వరలోనే తేలి పోనుందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం వారం రోజుల‌లో ఆమోదించాల‌ని డెడ్ లైన్ విధించారు. ముందుగా పూలే ,సావిత్రిబాయి పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు . బిసి రిజర్వేషన్లు పెంచడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బీసీ మేధావులు రాసిన లేఖను విడుదల చేశారు

తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసుకున్న కాకతీయ యూనివర్సిటీ నుండి బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేయడానికి కాకతీయ యూనివర్సిటీలో మేధావుల సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. బీసీ వ్యతిరేకులకు హెచ్చరిక చేసేందుకు.. రిజర్వేషన్ వ్యతిరేకులకు బుద్ధి చెప్పేందుకే ఓరుగల్లు ద‌నిని చేప‌ట్టామ‌న్నారు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ (Jajula Srinivas). రాష్ట్ర అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ పార్టీ ఇప్పుడు ప్లేట్ పిరాయించి బీసీలలో ముస్లింలు ఉన్నారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్ లు కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల త‌ప్పు ప‌ట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును యధావిధిగా పంపాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేకుంటే ముస్లిం రిజర్వేషన్లు ఉంచాలన్న తీసి వేయాలన్నా కేంద్రానికి అధికారం ఉందన్నారు. వారికి ఇష్టం లేకపోతే ముస్లిం రిజర్వేషన్ తొలగించి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి త‌మ చిత్త‌శుద్ది నిరూపించు కోవాల‌ని డిమాండ్ చేశారు. బీజేఎల్పి నేతగా కట్టర్ హిందూ రాజాసింగ్ ను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన ఏలేట్ మహేందర్ రెడ్డి ని శాసనసభ పక్ష నేతగా నియమించారని ఆరోపించారు. ఉప రాష్ట్రపతి దన్ఖడ్, దత్తాత్రేయ బీసీ లు కాబట్టే పదవులు తొలగించారని, రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా బీసీకి ఇవ్వకుండా అగ్ర కులాలకు ఇచ్చి బిజెపి వ్యతిరేక పార్టీగా మారిందని ఆయన ఆరోపించారు.

Also Read : MP Mithun Reddy – Liquor Scam : నేను ఎంపీని ఎక్క‌డికీ పారిపోను – మిథున్ రెడ్డి

Exit mobile version