CM Chandrababu : సింగపూర్ దేశం అంటే నాకు చాలా అభిమానం , గౌరవం అన్నారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). నీతి, నిజాయితీలకు సింగపూర్ దేశం నిలువెత్తు నిదర్శనం. ఈ దేశంలో అవినీతి తక్కువ. సింగపూర్ రోడ్ల మీద ఒక్క కాగితం ముక్క కూడా కన్పించదు. చాలా కాలం క్రితమే చెత్తను కూడా ఎనర్జీగా కన్వెర్ట్ చేసే విధానాన్ని సింగపూర్ ఆచరణలో పెట్టింది. అదే తరహా విధానాన్ని హైదరాబాద్ నగరంలో అమలు చేశానని చెప్పారు. చాలా మంది రాజకీయ నేతలు సింగపూర్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు.. కానీ ఏపీ సీఎం మాత్రం ఇక్కడికి వచ్చి తాను చేసిన మంచి పనులను అమలు చేస్తున్నారని సింగపూర్ దేశ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ చెప్పారన్నారు.
CM Chandrababu Praises Singapore
ఇలాంటి సింగపూర్ (Singapore) ప్రభుత్వంతో ఏపీకి గ్యాప్ వచ్చింది. నేను అడిగిన వెంటనే ఉచితంగా అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి సింగపూర్ ప్రభుత్వం అంగీకరించిందన్నారు. సింగపూర్ ప్రభుత్వం చాలా దేశాల్లో టౌన్ షిప్ లు కట్టింది. కాబట్టి సీడ్ క్యాపిటల్ నిర్మాణం సింగపూర్ ప్రభుత్వానికే అప్పగించాను. కానీ 2019లో ప్రభుత్వం మారి సింగపూర్ ను తప్పు పట్టే పరిస్థితి తీసుకువచ్చారు. వాటిని సరిదిద్ది.. రికార్డులు సరి చేయడానికే సింగపూర్ వచ్చాను. ఏపీ బ్రాండును సింగపూర్ లో తిరిగి నెలకొల్పడానికే వచ్చాను. మన రాష్ట్రంలో ఏ ఒక్కరు తప్పు చేసినా.. తెలుగు వాళ్లే చేశారంటారు. ఆ అభిప్రాయాన్ని సింగపూర్ ప్రభుత్వంలో.. సింగపూర్ కంపెనీల్లో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాను. సింగపూర్ కు కలిగిన అసౌకర్యానికి బాధ పడుతున్నానని వారికి చెబుతున్నాను.
సింగపూర్ ప్రభుత్వం మళ్లీ సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి ముందుకు రాకపోవచ్చు. జరిగిన వాస్తవాలను మాత్రం వారికి తెలియచేస్తాను. 2019లో కూడా మన ప్రభుత్వమే కొనసాగి ఉంటే.. అమరావతి సింగపూర్ స్థాయికి చేరేది. కానీ 2019 ఎన్నికల్లో గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇలాంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. ఈ బాధ్యత నా మీదే కాదు..మీ మీద కూడా ఉంది అన్నారు.
Also Read : CM Chandrababu Interesting Comments : తెలుగు వాళ్లు ప్రపంచమంతా విస్తరించారు
