CM Chandrababu : సింగపూర్ – ప్రతి దేశ రాజధానిలోనూ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలని, అందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu). విదేశాల్లో స్థిరపడి సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మరిచి పోకూడదని కోరారు. స్థానికంగా ఉన్న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో తెలుగు డయాస్పొరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ సహా మలేషియా, థాయ్ ల్యాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు హాజరయ్యారు. సీఎం సభా ప్రాంగణానికి రాగానే సభకు హాజరైన వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు. మా తెలుగు తల్లి గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం తెలుగుదనం ఉట్టిపడింది.
CM Chandrababu Key Comments
ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని.. తన సింగపూర్ (Singapore) పర్యటన ఉద్దేశాలను వివరించారు. ఈ ప్రపంచంలో మారుతున్న పరిణామాలను తెలుగు ప్రజలు అంది పుచ్చుకున్నారని చెప్పారు. నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు తెలుగు ప్రజల జీవితాలను మార్చాయన్నాఉ. ప్రపంచ వ్యాప్తంగా 120 పైగా దేశాల్లో తెలుగు ప్రజలు స్థిరపడ్డారని చెప్పారు. ఏ దేశానికైనా వెళ్లి.. గట్టిగా తెలుగులో మాట్లాడితే అక్కడున్న తెలుగు వారు ఓ పది నిమిషాల్లోనే పోగయ్యే పరిస్థితి వచ్చేసిందన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలకు తెలుగు వాళ్లు వెళ్లడమే కాదు.. ఆయా దేశాల్లోని స్థానికులకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారని అన్నారు.
ఇది తనకు గర్వంగా ఉందన్నారు. ఇదంతా నా వల్లే జరిగిందన్నారు. అమెరికాలో ఉండే స్థానికులకంటే.. తెలుగు వారి తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉందన్నారు నాదెళ్ల సత్య లాంటి వాళ్లు మైక్రో సాఫ్ట్ లాంటి ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు. ప్రపంచంలోని చాలా కంపెనీలకు సేవలు అందిస్తూ.. మన తెలుగు వాళ్లు వివిధ దేశాల్లో స్థిరపడ్డారని కొనియాడారు. సింగపూర్ లో 40 వేల మంది తెలుగు వాళ్లు నివాసం ఉంటున్నారు. తెలుగు వాళ్లు ఏయే దేశాల్లో స్థిర పడ్డారో.. ఆ దేశం వారికి కర్మభూమి..అవకాశాలు కల్పించిన ఆ దేశాభివృద్ధి కోసం పని చేయాలి. అదే సమయంలో పుట్టిన గడ్డను తెలుగు వాళ్లు మరువ కూడదని అన్నారు.
Also Read : Harish Rao Fired on CM Revanth Reddy : ఇంకెంత మంది చనిపోతే స్పందిస్తావో చెప్పు
