CM Chandrababu : అమరావతి – ఏపీలో పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి దుర్గేష్ సమక్షంలో రూ. 500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి. దీని వల్ల రాబోయే రోజుల్లో ఏపీ పర్యాటక హబ్ కానుందని ఆశా భావం వ్యక్తం చేశారు సీఎం. ఈ సందర్బంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రాండ్ కాన్యన్ ను ఆకాశం నుంచి వీక్షించేందుకు హెలిరైడ్స్ కూడా సెప్టెంబరు నుంచి మొదలు అవుతాయన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు కారావాన్ టూరిజం సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈజ్ మై ట్రిప్, హిల్టన్ హోటల్స్ సహా వివిధ సంస్థలు ముందుకు రావడం పట్ల అభినందించారు సీఎం.
CM Chandrababu Comments
గండికోటతో పాటు శ్రీశైలం, మంత్రాలయం, తిరుపతి తదితర ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణం, అడ్వెంచర్ స్పోర్ట్స్, హై రోప్, కయాకింగ్, జెట్ స్కీయింగ్ లాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన సాస్కి, స్వదేశ్ దర్శన్ పథకాల కింద గండికొట, బొర్రా గుహలు, అహోబిలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో వివిధ టూరిజం ప్రాజెక్టులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. టూరిజం పాలసీలో భాగంగా పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పిస్తున్నామన, అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి పెట్టుబడి దారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం, అడ్వెంచర్, క్రూయిజ్, వెల్ నెస్, కారావాన్, గోల్ఫ్, హెరిటేజ్, టెంపుల్ టూరిజం ప్రాజెక్టులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.
విశాఖ, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోటలను 7 యాంకర్ హబ్ లు గా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. అలాగే 25 థీమాటిక్ సర్క్యుట్ లను కూడా ప్రకటించామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టేలను కూడా ప్రోత్సహిస్తామని అన్నారు. రాష్ట్ర స్థాయిలో 8 పర్యాటక ఈవెంట్లను నిర్వహించటంతో పాటు జిల్లాల వారీగానూ కార్యక్రమాలు, టూరిజం ఫెస్టివల్స్ నిర్వహిస్తామన్నారు.
Also Read : CM Chandrababu Master Plan : పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
