CM Chandrababu : ఢిల్లీ, సెప్టెంబరు 30:- ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పాటిల్ ను కూడా కలిశారు. ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఏపీపై దృష్టి పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పూర్వోదయ పథకంలో భాగంగా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేశారు. పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్ర ఆర్ధిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
CM Chandrababu Request
రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం తన విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. ఈ రంగాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎకనమిక్ డెవలప్మెంట్ కు పూర్వోదయ పథకం అమలు ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. వెనుక బడిన ప్రాంతాల ఆర్థిక అభివృద్దికి దోహదం చేసేలా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ ను కోరారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖామంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం పనుల పురోగతిని గురించి కేంద్రమంత్రికి సీఎం వివరించారు.
Also Read : Indian Govt Important Update : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ కానుక – 30 రోజుల జీతానికి సమానమైన బోనస్

















