CM Chandrababu Important Comments : పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు : చంద్ర‌బాబు

ఫేక్ ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరు

Hello Telugu - CM Chandrababu Important Comments

Hello Telugu - CM Chandrababu Important Comments

CM Chandrababu : అమరావతి : పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం రెండేళ్లల్లో పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్పష్టం చేశారు. శాసనసభలో మంగళవారం వైద్యారోగ్య శాఖపై చర్చ సందర్భంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం అంశాన్ని సీఎం ప్రస్తావించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంలోని వాస్తవాలను సభ ముందు ఉంచారు. వైసీపీ అసత్య ప్రచారాలను అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎండగట్టారు. కాలేజీల నిర్మాణం, సీట్ల సంఖ్య, పేదలకు వైద్య సదుపాయాలు వంటి అంశాలను లెక్కలతో సహా వివరించారు. పీపీపీ మెడికల్ కాలేజీల నిర్మాణంపై సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చరిత్ర తెలియని వారు రాజకీయం కోసం మెడికల్ కాలేజీల నిర్మాణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

CM Chandrababu Key Comments

వైద్యారోగ్య రంగంలో మౌళిక సదుపాయాల కల్పన వేగంగా జరగాలంటే పీపీపీ విధానం అవసరం అని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. 1996లో తాను తొలిసారి సీఎం అయినప్పుడు ఆరు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇప్పుడు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉంద‌ని పేర్కొన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే విధానాన్ని అప్పట్లోనే తామ అమలు చేశామ‌ని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 38 మెడికల్ కాలేజీలు ఉన్నాయని వెల్ల‌డించారు. ప్రభుత్వ రంగంలో 18, ప్రైవేట్ రంగంలో 18, ఎయిమ్స్ మెడికల్ కాలేజీ, గీతమ్స్ యూనివర్శిటీలో మరో మెడికల్ కాలేజీ ఉందన్నారు. ఫేక్ న్యూస్ ఫేక్ ప్రచారంతో మెడికల్ కాలేజీలపై ప్రజలను కొందరు మభ్యపెడుతున్నారని మండిప‌డ్డారు నారా చంద్ర‌బాబు నాయుడు.

Also Read : Kolkata Huge Rains : కోల్‌కతాలో భారీ వర్షాలకు ఐదుగురు మృతి

Exit mobile version