11 నుంచి అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్ర

స‌క్సెస్ చేయాల‌ని పిలుపునిచ్చిన సీఎం చంద్ర‌బాబు

hellotelugu-ChandrababuNaidu

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్డీయే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. డిసెబ‌ర్ 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన యాత్ర చేప‌ట్ట‌నున్నార‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా పార్టీకి చెందిన శ్రేణులు, నేత‌లు పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. వాజ్ పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా అటల్ సందేశ్… మోదీ సుపరిపాలన యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి అభినందనలు తెలియ చేశారు. 11 నుంచి 25వ తేదీ వ‌ర‌కు జ‌రిగే యాత్ర‌లో తెలుగుదేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, బాధ్యులు , శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాల‌ని సూచించారు సీఎం.

రాజకీయ భీష్మునిగా భావించే అటల్ జీ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంద‌న్నారు .దేశంలో సుపరిపాలనకు వాజ్‌పేయ్ నాంది పలికారని,. ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాదిని వేశాయని ప్ర‌శంస‌లు కురిపించారు నారా చంద్ర‌బాబు నాయుడు. వాజ్ పేయి అజాత శత్రువు అని , ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారని పేర్కొన్నారు.ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్ పేయి కష్టంతో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారని చెప్పారు .9 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తోందన్నారు. 18 ఏళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు.

Exit mobile version