CM Chandrababu Important Comments : తుపాను బాధితుల‌కు సీఎం భ‌రోసా

ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు హామీ

Hello Telugu - CM Chandrababu Important Comments

Hello Telugu - CM Chandrababu Important Comments

CM Chandrababu : అమ‌రావ‌తి : మొంథా తుపాను ప్ర‌భావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎడ తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. బ‌ల‌మైన ఈదురు గాలుల తాకిడికి జ‌నం విల విల లాడుతున్నారు. వేలాది పంట‌ల‌కు న‌ష్టం వాటిల్లింది. చెట్లు నేల కూలాయి. భారీ ఎత్తున ఆస్తి న‌స్టం సంభంవించింది. ఇప్ప‌టికే రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, వాతావ‌ర‌ణ శాఖ తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దీంతో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు రంగంలోకి దిగారు. మంత్రుల‌ను, అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేశారు. ఆయ‌న అర్ధ‌రాత్రి దాకా స‌చివాల‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి స‌మీక్ష చేప‌ట్టారు. ఆయా మంత్రుల‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు.

CM Chandrababu Support to Cyclone Victims

మొంథా తుపాను తీవ్ర‌త నేప‌థ్యంలో స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu) ఏరియ‌ల్ స‌ర్వే చేప‌ట్టారు. అనంత‌రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం, ఓడలరేవులో ముఖ్యమంత్రి తుఫాన్ బాధితులను పరామర్శించారు. వారికి భ‌రోసా క‌ల్పించారు. పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.3000 చొప్పున సాయం అందించారు. అక్క‌డి నుంచి అరగట్లపాలెం, బెండమూరులంక గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను సీఎం పరిశీలించారు. పంట‌ల‌ను కోల్పోయిన రైతుల‌తో మాట్లాడారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని భరోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. త్వ‌ర‌లోనే పంట న‌ష్ట ప‌రిహారం అందిస్తామ‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.

Also Read : Minister Nara Lokesh Important Review : స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై నారా లోకేష్ స‌మీక్ష‌

Exit mobile version