అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ సంక్షేమ ఫ‌లాలు

ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-APCM

అమ‌రావ‌తి : రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ల‌బ్ది పొందేలా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష‌లాది మందికి పెన్ష‌న్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏలూరు జిల్లాలోజ‌రిగిన‌ పేదల సేవలో- ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. డిమాండ్ ఆధారిత పంటలు వేసి ఎక్కువ ప్రయోజనం పొందాలని సూచించారు. సమీకృత వ్యవసాయ విధానాలు అవలంబించాలని అన్నారు. డ్రోన్ లాంటి టెక్నాలజీలను వినియోగించి వ్యవసాయ వ్యయాన్ని తగ్గించు కోవాల‌ని పేర్కొన్నారు సీఎం. దిగుబడులు పెరగేందుకు కావాల్సిన అన్ని స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వ ప‌రంగా స‌హ‌కారం అంద‌జేస్తామ‌న్నారు. కేవ‌లం రూ.1.50 పైసలకే యూనిట్ చొప్పున ఆక్వా కల్చర్ కు విద్యుత్ సరఫరా ఇస్తున్నామ‌ని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.

ఆక్వా కల్చర్ అభివృద్ధి చెందేందుకు రూ.850 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుంద‌ని చెప్పారు. కొబ్బరి, కోకో, కాఫీ లాంటి పంటలు ఈ ప్రాంతంలో ఉన్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని రైతులు అంది పుచ్చుకోవాలని కోరారు సీఎం.. డిసెంబరు 3 తేదీన రైతు సేవా కేంద్రం పరిధిలో రైతులతో చర్చించాలని నిర్ణయించామ‌ని తెలిపారు. సంక్షేమం,అభివృద్ధి, సుపరిపాలన ఇస్తామని మాట ఇచ్చామ‌ని, ఆచ‌ర‌ణ‌లో చేసి చూపిస్తున్నామ‌ని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. 2029కి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామ‌ని ఆయ‌న మ‌రోసారి గుర్తు చేశారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయ‌ని ఈ సంద‌ర్బంగా చెప్పారు సీఎం.

Exit mobile version