CM Chandrababu Interesting Comments on Modi : మోదీ నాయ‌క‌త్వం దేశానికి బ‌లం : చంద్ర‌బాబు

ప్ర‌శంస‌లు కురిపించిన ఏపీ ముఖ్య‌మంత్రి

Hello Telugu - CM Chandrababu Interesting Comments on Modi

Hello Telugu - CM Chandrababu Interesting Comments on Modi

CM Chandrababu : లండ‌న్ : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న ప్ర‌ముఖులు, వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక‌వేత్త‌లు , కంపెనీల సీఇఓలు, ఎండీలు, త‌దిత‌రుల‌ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా లండ‌న్ వేదిక‌గా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) నిర్వహించిన వార్షిక లండన్ గ్లోబల్ కన్వెన్షన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. అనూహ్యంగా ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు సీఎం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీని. ఆయ‌న స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం దేశానికి దిశా నిర్దేశం చేసేలా సాగుతోంద‌న్నారు. గ‌తంలో పాలించిన ప్ర‌భుత్వాల కంటే ప్ర‌స్తుతం ఎన్డీయే సార‌థ్యంలోని స‌ర్కార్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మెప్పు పొందార‌ని చెప్పారు. ఏపీలో తెలుగుదేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల సంయుక్త ఆధ్వ‌ర్యంలో అద్భుతంగా ప్ర‌జా పాల‌న సాగిస్తున్నామ‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.

CM Chandrababu Praises PM Modi

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో పాల‌న సాగిస్తున్నారంటూ న‌రేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేశారు సీఎం. తాము వ‌చ్చాక ఏపీ రాష్ట్ర రూపు రేఖ‌లు మార్చేందుకు ప్ర‌య‌త్నం చేశామ‌న్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా రైజింగ్ దిశ‌గా దూసుకు పోతోంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌ధానంగా రాష్ట్రానికి ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్య నమూనా ద్వారా వ్యాపారం చేయడంలో వేగం కోసం తన దార్శనికతను వివరించారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలమైన నాయకత్వం భారతదేశం అందించే ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటిగా ఉంద‌న్నారు. ఇది 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంద‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి. ఇందులో భాగంగా విశాఖ వేదిక‌గా సీఐఐ స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్నారు.

Also Read : BJP Deepak Reddy Gets Huge Support : బీజేపీ అభ్య‌ర్థి దీప‌క్ రెడ్డికి జ‌న‌సేన మ‌ద్ద‌తు

Exit mobile version