CM Chandrababu Interesting Comments : టెక్నాలజీతో క్యూలైన్ల నిర్వహణకు ఐసీసీ సెంటర్

పరిశీలించిన సిఎం నారా చంద్రబాబు నాయుడు

Hello Telugu - CM Chandrababu Interesting Comments

Hello Telugu - CM Chandrababu Interesting Comments

CM Chandrababu : తిరుమ‌ల : తిరుమలలో పీఏసీ – 5ను ప్రారంభించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఐసిసి సెంటర్ ను ప‌రిశీలించారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి (CM Chandrababu) మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా అత్యుత్తమ విధానాన్ని అనుసరించాలని సూచించారు. అంతకు ముందు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం రెడీ అనలటిక్స్, మెషీన్ లెర్నింగ్ సాయంతో నిరీక్షణలో ఎంత మంది భక్తులు ఉన్నారో గుర్తించి అందుకు అనుగుణంగా క్యూలైన్ నిర్వహణ చేపడతామని ఈవో వివరించారు. అలాగే భక్తుల వేచి ఉండే క్యూ కాంప్లెక్సుల్లో భక్తి భావన పెంపోందించేలా ఆధ్యాత్మిక వీడియోలను, శ్రీవారి చరిత్రను ప్రదర్శించాలని సిఎం ఆదేశించారు.

CM Chandrababu Comments

తిరుమల కొండపైకి నిషేధిత వస్తువులు తీసుకు రాకుండా అలిపిరి వద్దే నిలువరించేలా ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచే టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలని స్ప‌ష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించిన సీసీ కెమెరాల సాయంతో అలిపిరి నుంచే రద్దీ హీట్ మ్యాప్ లను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీవారి ఏడుకొండలు ఏడు రంగులతో గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మానసిక ప్రశాంతత ఆలయాలలో మాత్రమే ఉంటుందని, ఆలయాల నిర్మాణాలకు, నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్ప‌ష్టం చేశారు.

Also Read : CM Revanth Reddy- Rains Warning : ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాలి : సీఎం

Exit mobile version