CM Chandrababu : అమరావతి : మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి అత్యవసర సమీక్ష చేపట్టారు. ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించ కూడదని , అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అవసరమైన అన్ని నిధులను ఇచ్చేందుకు సిద్దంగా ఉందన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సూచించారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టం పైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పైనా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆరా తీశారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని ఆదేశించారు సంబంధిత ఉన్నతాధికారులను.
CM Chandrababu Focus
ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలని, పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని అన్నారు సీఎం. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ వేగంగా పంపిణీ చేయాలన్నారు. తుఫాన్ తీరం దాటడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని ముఖ్యమంత్రికి వివరించారు ఈ సందర్భంగా అధికారులు . రాష్ట్రంలో 1,209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 1.16 లక్షల మందికి ఆశ్రయం కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం పడిందన్నారు సీఎం. 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందన్నారు.
Also Read : Minister TG Bharath Important Update : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు భూమి గుర్తింపు
