TG Bharath : కర్నూలు జిల్లా : ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ (TG Bharath) కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన భూమిని గుర్తించడం జరిగిందని వెల్లడించారు. తాజాగా కీలక అప్ డేట్ ఇచ్చారు మంత్రి. తమ సర్కార్ భూమిని కేటాయించేందుకు సిద్దంగా ఉందన్నారు. ముంథా తుపాను ప్రభావంతో టీజీ భరత్ ఎస్బీఐ ఉద్యోగుల కాలనీలోని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్ పి. విశ్వనాథ్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పరిశ్రమల మంత్రి టి.జి. భరత్ అన్నారు. తన ఇటీవలి విదేశీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుతో ఈ విషయంపై చర్చించానని చెప్పారు.
Minister TG Bharath Comments
ఈమేరకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి పేర్కొన్నారు. శివార్లలో బెంచ్ ఏర్పాటు చేయడానికి బదులుగా, నగర పరిధిలో, ముఖ్యంగా బి, సి క్యాంప్ ప్రాంతాలలో దానిని గుర్తించే ప్రణాళికలను పరిశీలిస్తున్నామని టీజీ భరత్ తెలిపారు . ఈ ప్రాంతంలో 160 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అన్నారు. దాని విలువ ఎకరానికి దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందని, ప్రభుత్వం దానిని సమర్థవంతంగా ఉపయోగించు కోవాలని యోచిస్తోందని చెప్పారు టీజీ భరత్. ఈ భూమిలో కొంత భాగాన్ని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల కోసం కూడా గుర్తిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు . ఇదే సమయంలో రూ. 12.62 కోట్ల అభివృద్ది పనులు నత్త నడకన సాగుతుండడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి.
Also Read : Telangana Govt Clear Update : గిగ్ వర్క్ లో పారదర్శకత కోసం చట్టం
