CM Chandrababu Warning : ఎరువుల అక్రమ విక్రయాలపై ఉక్కుపాదం

ఎవరినీ ఉపేక్షించ వద్దని చంద్రబాబు ఆదేశం

Hello Telugu - CM Chandrababu Warning

Hello Telugu - CM Chandrababu Warning

CM Chandrababu : అమరావతి : రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల అక్రమ విక్రయాలు జరగకూడదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) . దీంతో సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల విజిలెన్స్ బృందాలు దాడులు చేశాయి. గత వారం రోజులుగా నిర్వహించిన సోదాల్లో పెద్దఎత్తున ఎరువుల అక్రమ నిల్వలు బయట పడ్డాయి. అలాగే బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి కొందరు డీలర్లు అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నట్టు దాడుల్లో వెళ్లడైంది. ఆగస్ట్ 23 నుంచి ఆగస్ట్ 31 వరకు మొత్తం 286 విజిలెన్స్ బృందాలు 598 దుకాణాల్లో తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా అక్రమంగా విక్రయిస్తున్న రూ.1.83 కోట్ల విలువైన 934 మెట్రిక్ టన్నుల ఎరువులు సీజ్ చేశారు.

CM Chandrababu Strong Warning

వారిపై 67 కేసులు నమోదు చేశారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన రూ.4.30 కోట్ల విలువ చేసే 1,911 మెట్రిక్ ట‌న్నుల‌ ఎరువుల అమ్మకాలు తాత్కాలికంగా నిలిపి వేస్తూ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 124 కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన మరో 8 దుకాణ యజమానులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. దీనిపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రైతుల‌ను ఇబ్బంది పెట్టేలా ఫెర్టిలైజర్ దుకాణదారులు, డీలర్లు నడుచుకుంటే వారిని ఉపేక్షించవద్దని అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అన్నదాతల‌కు ఎక్కడా ఎరువులు, పురుగు మందుల కొరత రానియొద్దని స్ప‌ష్టం చేశారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది ప‌డినా తాను ఊరుకోనంటూ పేర్కొన్నారు.

Also Read : Minister Savitha – AP Growth : కూట‌మి పాల‌నతోనే ఏపీకి శ్రీ‌రామ ర‌క్ష – స‌విత‌

Exit mobile version