CM Chandrababu Interesting Comments : పండుగ‌ల‌ను స్పూర్తిగా తీసుకోవాలి : సీఎం

భార‌తీయ సంస్కృతికి ద‌ర్ప‌ణం ఈ ఫెస్టివ‌ల్స్

Hello Telugu - CM Chandrababu Interesting Comments

Hello Telugu - CM Chandrababu Interesting Comments

CM Chandrababu : అమ‌రావ‌తి : దుష్టశక్తులను అంతం చేసినందుకు దసరా, దీపావళి పండుగలు జరుపుకుంటామ‌ని అందుకే మ‌నంద‌రం ఈ పండుగలను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మన సంస్కృతిలో భాగమైన పండుగల్ని ఉత్సాహంతో చేసుకోవాల‌న్నారు. ఆ పండుగల సారాంశాన్ని గ్రహించాల‌ని కోరారు.. రాష్ట్రానికి మళ్లీ దుష్ట శక్తులు రాకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ పండుగలు నేర్పించే పాఠాలను అర్థం చేసుకోవాలని సూచించారు సీఎం. 16 నెలల క్రితం వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). పాలన ఎక్కడికక్కడ ఆగిపోయింది. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను కూడా గత పాలకులు నడవ నీయలేదన్నారు. 16 నెలల క్రితం వరకూ పరదాలు కట్టుకుని, గోతులు తవ్వారు. ప్రజల్ని భయాందోళనలో ఉంచారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ధ్వ‌జ‌మెత్తారు.

CM Chandrababu Key Comments

పేదల సంక్షేమంలోనూ డబ్బులు బొక్కేసిన వాళ్లు రాజకీయానికి పనికిరారంటూ జోష్యం చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి దుష్టశక్తులు రాకుండా, ప్రజలకు చెడు జరగకుండా కాపాడు కోవాల‌ని అన్నారు. మనకు ఇక ఈ వైకుంఠపాళి వద్దు. గుజరాత్ లో 25ఏళ్లుగా ఉన్న సుస్థిర పాలనను స్ఫూర్తిగా తీసుకోవాల‌ని కోరారు. కేంద్రంలో 15ఏళ్లుగా ఎన్డీఏ ఉన్నందునే ప్రజల కష్టాలు తీరాయన్నారు. వైకుంఠపాళీ వల్ల రాష్ట్రానికి ఇబ్బందులే అందుకే అలాంటి వారి పాలన మనకు వద్దు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అభివృద్ధి సాధ్య‌మ‌వుతోంద‌న్నారు చంద్రబాబు నాయుడు. 16 నెలల కాలంలో వ్యవస్థలను గాడిలో పెట్టాం. సంపద సృష్టించి పేదలకు పంచుతూ సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

Also Read : TTD EO Important Updates : సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తాం : ఈవో సింఘాల్

Exit mobile version