CM Chandrababu : లండన్ : వ్యాపారంలోనే కాదు అన్ని రంగాలలో మానవీయ విలువలే ప్రాతిపదిక కావాలని పిలుపునిచ్చారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). లండన్ పర్యటనలో ఆయన బిజీగా ఉన్నారు. దిగ్గజ కంపెనీలు, సీఈఓలు, పారిశ్రామికవేత్తలు, మేనేజింగ్ డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ లు, ఔత్సాహికులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లండన్ వేదికగా జరిగిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రసంగించచారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ లండన్‌లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించబడిన తన సతీమణి భువనేశ్వరి పట్ల నేను చాలా గర్వపడుతున్నానని అన్నారు సీఎం. మొదటిది, IOD డిస్టింగుష్డ్ ఫెలో అవార్డు, ప్రజా సేవ, వ్యాపార నాయకత్వం, సమాజానికి ఆమె చేసిన విశేష కృషిని గుర్తిస్తుందన్నారు.
CM Chandrababu Comments
రెండవది గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ 2025 ఇది పూర్తిగా నైతిక పాలన, కార్పొరేట్ ఎక్సలెన్స్ పట్ల దాని అచంచలమైన నిబద్ధతకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. భువనేశ్వరి కేవలం ఒక వ్యవస్థాపకురాలు, పరోపకారి మాత్రమే కాదన్నారు. విలువలు, కరుణ , నాయకత్వం ద్వారా భారతీయ , తెలుగు వారసత్వానికి ప్రతీకగా భావించే సంస్కృతి, విలువలను పెంపొందించేందుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. భువనేశ్వరి సాగిస్తున్న ప్రయాణం తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తూనే ఉందన్నారు. ఈ అవార్డులు తమ మీద మరింత బాధ్యతను పెంచేలా చేశాయన్నారు.
Also Read : Minister Atchannaidu Fired on YS Jagan : చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్ కు లేదు
