CM Chandrababu : అమరావతి : బిందు సేద్యంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ వన్ లో ఉందని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). శాసనసభలో సోమవారం ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు అమెరికా విధించిన సుంకాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ విషయం తనతో ఎమ్మెల్యేలు వాపోయారని చెప్పారు. వీటన్నింటని దృష్టిలో పెట్టుకుని తాను కేంద్రంతో మాట్లాడానని, రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ఆక్వా రైతుకు నష్టం కలగకుండా చూసుకుంటామని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ఇది రైతుల సంక్షేమ ప్రభుత్వమని మరోసారి స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం అన్నదాతలను ఆగమాగం చేసిందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఉల్లిగడ్డ పండించే రైతులకు హెక్టారుకు రూ. 50 వేలు ఇస్తున్నామని అన్నారు.
CM Chandrababu Key Comments
గతంలో ఏ సర్కార్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. అయితే రైతులు ప్రధానంగా సాధ్యమైనంత మేరకు యూరియా వాడకాన్ని తగ్గించు కోవాలని సూచించారు. లేకపోతే ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. సేంద్రీయ వ్యవసాయం పై ఎక్కువగా దృష్టి సారించాలని కోరారు. దీని వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని చెప్పారు. 90 శాతం సబ్సిడీని మైక్రో ఇరిగేషన్ వినియోగించే రైతులకు అందిస్తున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లక్ష హెక్టార్లకు 15 టీఎంసీల నీరు ఆదా అవుతుందన్నారు. ఏడేళ్లలో 105 టీఎంసీల నీరు ఆదా అయినట్టేనని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశానికి హార్టికల్చర్ హబ్ గా మారుతుందన్నారు సీఎం. రాష్ట్రంలో లైవ్ స్టాక్ 19 లక్షల మందికి నేరుగా జీవనోపాధి కల్పిస్తోందన్నారు. భవిష్యత్తులో అతిపెద్ద ఆర్ధిక లావాదేవీలకు ఆస్కారం ఉన్న రంగంగా లైవ్ స్టాక్ ఉండబోతోందని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.
Also Read : KTR Sensational Comments : తెలంగాణ భవన్ కాదు జనతా గ్యారేజ్ : కేటీఆర్
