KTR : హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ భవన్ పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి ఇది తెలంగాణ భవన్ కానే కాదన్నారు. ఇవాల్టి నుంచి అది జనతా గ్యారేజ్ గా పని చేస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గతంలో ఇదే పేరుతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ పేరుతో సినిమా వచ్చింది. ఇందులో ప్రముఖ నటుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత , మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో పాటు దమ్మున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలు పోషించారు. సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా హిట్ కావడంతో ప్రతి ఒక్కరు జనతా గ్యారేజ్ అని వాడడం మామూలై పోయింది.
KTR Slams
ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఇక్కడికి రావొచ్చని తెలిపారు. ఇక్కడ న్యాయవాదులు ఉంటారని, వాళ్ళకు మీ సలహాలు చెప్పి, సహాయం పొందొచ్చని సూచించారు. తమ హయంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో భూములు కోల్పోయిన రైతులను కేసీఆర్, మంత్రులు వెళ్ళి కలిసి ఒప్పించారు . రోజులు రోజులు చర్చించి వారికి ఇల్లు, పరిహారం ఇచ్చి సముదాయించి ఒప్పించామని చెప్పారు కేటీఆర్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూల్చివేతలు జరుగుతున్నా వారి దగ్గరికి వెళ్లడానికి మొహం చాటేశారంటూ మండిపడ్డారు. భూములు, ఇండ్లు కోల్పోతున్న బాధితులు అలైన్ మెంట్ శాస్త్రీయంగా చేయాలని, నష్ట పరిహారం సమంజసంగా ఇవ్వాలని డిమాండ్ చేయాలని కోరాలన్నారు.
Also Read : Hyderabad Heavy Rains Sensational : హైదరాబాద్ ను ముంచెత్తిన వాన
