CJI Justice Gavai : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వాకం, వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice Gavai). రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరంగా వ్యవస్థీకృతమైన సంస్థగా ఉండాల్సిన ఈడీ కేవలం కొందరి ప్రయోజనాల కోసం పని చేసేలా వ్యవహరించడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు సీజేఐ.
CJI Justice Gavai Shocking Comments
ఈడీ అధికారులు హద్దులు దాటి ప్రవర్తిస్తుండడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంకోసారి గనుక లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. రెండు కేసులు విచారణ జరుపుతూ ఈడీ పని తీరుపై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీ సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈడీ అధికారులు అన్ని హద్దులు దాటేస్తున్నారని, రాజకీయ యుద్ధాలలో పావులుగా మరొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మీ గురించి ఇంతకంటే కఠినంగా మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దని ఈడీకి సూచించారు జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం . ఈడీకి అడ్డుకట్ట వేసేందుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది . మరోవైపు ఈడీపై మండిపడ్డ మద్రాస్ హైకోర్టు. ప్రతీ నేరాన్ని విచారించడానికి ఈడీ సూపర్ పోలీస్ కాదు.. ప్రతీ నేర కార్యకలాపాలపై దాడి చేసేందుకు ఈడీ అధికారులు డ్రోన్లు కాదని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read : Kerala Ex CM Achuthanandan Death : అరుదైన ప్రజా నాయకుడు అచ్యుతానందన్
