CJI Justice Gavai : విజయవాడ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదివారం విజయవాడకు రానున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. ‘ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్’ అనే అంశంపై ప్రసంగిస్తారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు గవర్నర్ నజీర్ కూడా హాజరవుతున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు పాల్గొంటారని తెలిపారు నిర్వాహకులు.
CJI Justice Gavai Visit
ఇదిలా ఉండగా త్వరలోనే సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice Gavai) పదవీ విరమణ చేయనున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన తనకు ఉన్నత పదవి దక్కింది. ఇదే సమయంలో కీలకమైన తీర్పులు వెలువరించారు. దేశంలో ప్రజాస్వామ్య స్పూర్తికి భంగం వాటిల్లుతోందని ఆవేదన చెందారు. ఇదే సమయంలో తను చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ లాయర్ ఏకంగా కోర్టు ఆవరణలో తనపై షూ విసిరేందుకు ప్రయత్నం చేశారు. దానిని ఆయన లైట్ గా తీసుకున్నారు. ఈ దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు అవుతున్నా నేటికీ కుల వివక్ష, వర్ణ వివక్ష , మతం ఆధారంగా వివక్ష కొనసాగుతూనే ఉందని సీజేఐ ఆవేదన చెందారు.
Also Read : CM Chandrababu Important Update : ఓర్వకల్లులో 300 ఎకరాలలో డ్రోన్ సిటీ
















