CJI : ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సుప్రీంకోర్టులో దిగ్భ్రాంతికరమైన సన్నివేశానికి వేదికైంది. భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI) విచారణ నిమిత్తం ఆసునలయ్యారు. ఇంతలోనే ఒకరు షూ విసిరేందుకు ప్రయత్నం చేశాడు. అందరూ న్యాయవాదులు అక్కడే ఉన్నారు. వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన అనంతరం స్పందించారు సీజేఐ జస్టిస్ గవాయ్. విష్ణువుపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ వెంటనే ఒకరు బూటు విసిరేందుకు ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని పేర్కొన్నారు సీజేఐ. అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇది ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.
CJI Respond
కాగా విసిరిన షూ బెంచ్‌కు చేరలేదు . ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కోర్టు గదిలో జరిగిన దిగ్భ్రాంతికరమైన పరిణామంతో ఆశ్చర్య పోలేదు చీఫ్ జస్టిస్ గవాయి, ఇలాంటి వాటి వల్ల ప్రభావితమైన చివరి వ్యక్తి నేన అని అన్నారు. ఆ తర్వాత తేరుకుని విచారణను కొనసాగించారు. ప్రధాన న్యాయమూర్తి ఆ రోజు మొదటి కేసును వినడం ప్రారంభించినప్పుడు సదరు వ్యక్తి సనాతన సంస్థ అవమానాన్ని భారతదేశం సహించదంటూ నినాదాలు చేశాడు. సీజేఐని చూస్తూ బూటు విసిరాడు. దీనిని విసిరిన వ్యక్తికి కార్డు ఉంది. అందులో తన పేరు కిషోర్ రాకేష్ అని రాసి ఉంది. తనను భద్రతా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా తనపై బూటు విసిరిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించారు సీజేఐ.
Also Read : Pak Minister Khawaja Asif Shocking Comments : భారత్ ను నామ రూపాలు లేకుండా చేస్తాం

















