Jagan Mohan : హైదరాబాద్ – హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును అరెస్ట్ చేసింది దర్యాప్తు సంస్థ సీఐడీ. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో తనను అదుపులోకి తీసుకుంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏపై (HCA) కేసు నమోదు చేసింది. ఐపీఎల్ ప్రాంచైజీ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను టిక్కెట్ల కోసం బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేపట్టింది విజిలెన్స్ శాఖ. ఈ మేరకు నివేదిక అందించింది. దాని ఆధారంగా దూకుడు పెంచింది. ఇదిలా ఉండగా జగన్మోహన్ రావు ను గత బీఆర్ఎస్ సర్కార్ పెద్ద ఎత్తున సపోర్ట్ చేసింది.
HCA President Jagan Mohan Arrested
ఇక జగన్మోహన్ రావు వచ్చాక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నం చేసినా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ కూడా హెచ్ సీ ఏకు ప్రెసిడెంట్ గా ఉన్నాడు. తన హయాంలో కూడా టికెట్ల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. చివరకు అంబుడ్స్ మెన్ కమిటీని ఏర్పాటు చేసింది కోర్టు.
కాంప్లిమెంటరీ టికెట్ల కోసం సదరు ఫ్రాంచైజీపై తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రావు ఒత్తిడి తెచ్చాడని విమర్శలు ఉన్నాయి. ఇది భారీ వివాదాన్ని రేకెత్తించింది. దీంతో రంగంలోకి దిగింది తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ . తన కార్యకలాపాలలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు జగన్ మోహన్ రావును అరెస్టు చేసింది. విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఇది జరిగింది.
జగన్ మోహన్ రావుతో పాటు ఇద్దరు ఆఫీస్ బేరర్లు దేవరాజ్, శ్రీనివాస్ , సునీల్ కాంటేలపై వేర్వేరు ఎఫ్ ఐ ఆర్ లు నమోదయ్యాయి.
Also Read : Yarlagadda Lakshmi Prasad Growth : కేంద్ర హిందీ సలహా సమితిలో యార్లగడ్డకు చోటు


















