చెన్నై : ప్రపంచ క్రికెట్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక మెగా టోర్నమెంట్ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) . ఈ ఏడాది మార్చి 28వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐపీఎల్ గవర్నింగ్ బాడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. తొలి విడతలో భాగంగా మొత్తం 20 మ్యాచ్ లు నిర్వహిస్తారు. ప్రస్తుతం భారత దేశంలోని 5 రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది. దీంతో ఐపీఎల్ లో పాల్గొనే 10 జట్లు రెడీ అవుతున్నాయి.
ఈ తరుణంలో గత కొన్నేళ్లుగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు కేరళ స్టార్ క్రికెటర్, ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో సూపర్ హీరోగా , ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్. కానీ అనూహ్యంగా తాను రాజస్థాన్ నుంచి తప్పకున్నాడు. తనను ఏరికోరి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం శాంసన్ ను ఇన్నర్ ట్రేడ్ ద్వారా దక్కించుకుంది. ఇందులో భాగంగా తమ జట్టు నుంచి రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ కు ఇచ్చింది. ప్రస్తుతం చెన్నైకి చేరుకున్నాడు సంజు శాంసన్. ఈ సందర్భంగా మైదానంలో తనకు గ్రాండ్ వెల్ కమ్ లభించింది. ప్రాక్టీస్ కూడా చేయడం మొదలు పెట్టాడు.



















