Chiranjeevi : హైదరాబాద్: విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఈ సందర్బంగా తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. తామిద్దరి నట ప్రస్థానం ఒకే సినిమాతో ప్రారంభమైందన్నారు. తెరమీద కోటా శ్రీనివాసరావు నటన అద్భుతంగా పండించారన్నారు. ఆయన హాస్య చమత్కారం కూడా తనను విస్తు పోయేలా చేసేదన్నారు. కోట శ్రీనివాసరావు అన్ని యాసలు, మాండలికాలు అవలీలగా మాట్లాడుతూ తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయమైన స్థానం సంపాదించు కున్నారని పేర్కొన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. కోట మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు.
Chiranjeevi Comments
కోట శ్రీనివాస రావు సినీ ప్రస్థానం చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదుతో ప్రారంభమైంది. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా. విలన్ గా, కమెడియన్, తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా, పిసినారిగా, పోలీసుగా ఇలా అద్భుతమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం తర్వాత ఆ లోటును భర్తీ చేశారు.
నటనా పరంగా తెలుగునాట చెరిగిపోని ముద్ర వేశారు కోట శ్రీనివాసరావు. ఆయన నటన చిరస్మరణీయం..అజరామరం. సినీ కళామతల్లి ఉన్నంత వరకు తను వెలుగుతూనే ఉంటారు. ఓవైపు నటుడిగా ఇంకో వైపు రాజకీయ నాయకుడిగా ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో ముఖ్య భూమిక పోషించారు. తనకు ఎదురే లేదని చాటారు కోట శ్రీనివాసరావు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.
Also Read : CM Revanth Reddy Interesting Comments : రాష్ట్రాలు అభివృద్ది చెందితేనే దేశాభివృద్ది
