Chinta Mohan Shocking Comments : ఎన్నిక‌ల సంఘం నిర్వాకం ఓట్ల చోరీ నిజం

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన చింతా మోహ‌న్

Hello Telugu - Chinta Mohan Shocking Comments

Hello Telugu - Chinta Mohan Shocking Comments

Chinta Mohan : తిరుప‌తి – ఈ దేశంలో అత్యున్న‌తమైన కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌న విధుల‌ను పూర్తిగా విస్మ‌రించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహ‌న్ (Chinta Mohan). AICC పిలుపు మేరకు తిరుపతి లో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఓట్లు చోరీ ఆపాలని, ఓట్ల దొంగలను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతా మోహ‌న్ పాల్గ‌గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఏ విధంగా జరిగిందో అంద‌రూ చూశార‌న్నారు. దొంగ ఓట్లు వేసుకున్నారని, గెలిచార‌ని ఆరోపించారు.

Ex Union Minister Chinta Mohan Key Comments

అదేవిధంగా దొంగ ఓట్ల కార్యక్రమం బీహార్లో మొదలైంద‌ని మండిపడ్డారు చింతా మోహ‌న్. ఒకే ఇంట్లో 85 ఓట్లు నమోదు ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించారు. బీహార్ రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు చేర్చార‌ని దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. దీని వెనుక ఎలక్షన్ కమిషన్ ఉందని ఆరోపించారు .

ఒకప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ సెలక్షన్ కమిటీలో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఉండే వార‌ని, కానీ ఇప్పుడు ప్ర‌ధాని మోదీ ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం తీశేయించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు మోడీ, అమిత్ షా ఇద్దరే సెలక్షన్ చేసుకుంటున్నారని, వాళ్ళిద్దరూ సిట్ , స్టాండ్ వాళ్లే కేంద్ర ఎన్నికల సంఘంలో కొనసాగుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. న్యాయంగా, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంద‌న్నారు. చాలా కాలంగా కడపలో రిగ్గింగ్ చేసుకోవడం అలవాటన్నారు.

Also Read : Rajnath Singh Important Call : జ‌గ‌న్ రెడ్డికి రాజ్ నాథ్ సింగ్ ఫోన్

Exit mobile version