Chinta Mohan : కాకినాడ : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ (Chinta Mohan) సంచలన కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కి బదులు అప్పటి డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ముఖ్యమంత్రిని చేసి ఉంటే రాష్ట్రం రెండు ముక్కలయ్యేది కాదన్నారు. దళిత విభజన జరిగి ఉండేది కాదని, మాల మాదిగలు విడి పోయేవారు కాదన్నారు. ఎస్సీలు కలిసి ఉండే వాళ్లన్నారు. కెసిఆర్ మూమెంట్ కి, తెలంగాణ ఉద్యమానికి తెలంగాణలోని మాదిగలు ముందు నడిచారని చెప్పారు. దళితులను రెండు భాగాలుగా చేయడం వల్లే, రాష్ట్రం రెండుగా విభజన జరిగిందన్నారు.
Ex Union Minister Chinta Mohan Shocking Comments
మా వైపు నుంచి చిన్న పొరపాటు జరిగింది. సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి మా చాయిస్ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ కరెక్ట్ పర్సన్ అన్నారు. నేను రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఉన్నాను. నానక్ పూర్ కు వెళ్లాను. 40 అంతస్తుల బిల్డింగులు వందకుపైగా చూశాను. నాకు చాలా బాధేసింది. మన సంపదంతా, పోగొట్టుకున్నామని అనిపించిందన్నారు. 40 సంవత్సరాల క్రితం టిడిపి పుట్టిందని, కాంగ్రెస్ వైపు ఎస్సీలు ఉన్నారని చెప్పారు.
20 శాతం వున్న మాల, మాదిగలను కొంత మన వైపు తీసుకోవాలని టిడిపి భావించింది. దళిత విభజనకు కుట్ర పన్నిందని ఆరోపించారు. దళితుల కెమిస్ట్రీ గురించి చాలా మందికి తెలియదు. మోడీ, చంద్రబాబుకు అసలే తెలీదన్నారు. కాశ్మీర్ నుంచి, కన్యాకుమారి వరకు 800 కులాలు ఎస్సీల్లో ఉన్నారని చెప్పారు చింతా మోహన్. ఒక్క యూపీలోనే ఎస్సీల్లో 86 ఉప కులాలు ఉన్నాయని అన్నారు. వర్గీకరణ బిల్లును వెంటనే చంద్రబాబు నాయుడు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : Prashant Kishor Fired on CM Revanth : రేవంత్ రెడ్డిని తరిమి కొట్టడం ఖాయం : పీకే

















