తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు

30 నుంచి ప్రారంభం అవుతుంద‌ని ప్ర‌క‌ట‌న

hellotelugu-Chinalaunches

చైనా : యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయేలా బిగ్ షాక్ ఇచ్చింది డ్రాగ‌న్ చైనా. త‌న కంట్లో న‌లుసుగా మారిన తైవాన్ పై కొంత కాలం నుంచి క‌య్యానికి కాలు దువ్వుతోంది. సోమ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది చైనా. ఈ మేర‌కు సైనిక విన్యాసాల‌కు శ్రీ‌కారం చుడుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు చైనా ప్రెసిడెంట్. ఇందుకు సంబంధించి సైనిక విన్యాసాల‌కు పేరు కూడా పెట్టిన‌ట్లు తెలిపారు. దీనికి జ‌స్టిస్ మిష‌న్ 2025 పేరుతో సైనిక విన్యాసాలు చేస్తామ‌న్నారు. ఈ చ‌ర్య‌ డిసెంబర్ 30న స్థానిక సమయం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుందని కూడా ప్ర‌క‌టించారు. అధికారిక సందేశం ప్రకారం జాయింట్ స్వోర్డ్ A, జాయింట్ స్వోర్డ్ B , స్ట్రెయిట్ థండర్ వంటి మునుపటి విన్యాసాల కంటే ఈ విన్యాసాలు చాలా పెద్దవని తెలిపింది చైనా.

ట్రంప్ పరిపాలన సమయంలో ఈ పరిమాణంలో జరిగిన మొదటి సైనిక విన్యాసాలు ఇవి కావ‌డం గమ‌నార్హం. ఇది ప్రాంతీయ సైనిక కార్యకలాపాలలో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. ఈ విన్యాసాలతో పాటు చైనా ప్రకటనలు మునుపటి కంటే పదునైన భాషను ఉపయోగించ‌డం ఒకింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. దిగ్బంధన కార్యకలాపాలు, యునైటెడ్ స్టేట్స్ నుండి తైవాన్‌ను రక్షించే ప్రయత్నాలు మొద‌ల‌య్యాయి కానీ ఏ మేర‌కు చైనా ఒప్పుకుంటుంద‌నేది అనుమాన‌మే. తైవాన్ కోస్ట్ గార్డ్ అడ్మినిస్ట్రేషన్ సమీప జలాల్లో చైనీస్ కోస్ట్ గార్డ్ కార్యకలాపాలను పెంచినట్లు నివేదించింది. తైవాన్‌కు దగ్గరగా పనిచేస్తున్న చైనీస్ కోస్ట్ గార్డ్ నౌక 1303 ను చూపించే చిత్రాన్ని కూడా ఇది విడుదల చేసింది. అయితే, చైనీస్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ఈ కసరత్తులలో పాల్గొంటున్నట్లు ప్రకటించలేదు. ఇదిలా ఉండ‌గా క్రాస్-స్ట్రెయిట్ ఉద్రిక్తతల మధ్య తైవాన్ జలసంధిలో స్థిరత్వంపై ఈ పరిణామాలు తాజా ఆందోళనలను లేవనెత్తాయి.

Exit mobile version