అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, పది సూత్రాల అమలుపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కీలక సమీక్ష సమావేశం చేపట్టారు.
సీఎస్ కె.విజయానంద్, జలవనరులు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అనే విధానంలో వేగంగా పౌరులకు మెరుగైన పాలన అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సుస్థిరాభివృద్ధితో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు కావాల్సిన నిర్దేశించు కోవాల్సిన అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం, తక్కువ వ్యయంతో ఇంధనం, విద్యుత్, రవాణా, నీటి భద్రత అందించటం లక్ష్యంగా ప్రణాళికల రూపకల్పన చేయాలని స్పష్టం చేశారు సీఎం.
జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సాంకేతికత మేళవింపు తదితర అంశాల ఆధారంగా లక్ష్యాలు నిర్దేశించు కోవాలని సూచించారు నారా చంద్రబాబు నాయుడు. ఇదే సమయంలో ప్రభుత్వం పవర్ లోకి వచ్చాక అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఏ విధంగా అమలు అవుతున్నాయో కూడా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యాయుతంగా పని చేయాలని పేర్కొన్నారు సీఎం. లేకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. ప్రతి శాఖకు సంబంధించి స్పష్టమైన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.



















