చిత్తూరు జిల్లా : దావోస్ లో నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన వచ్చిన వెంటనే సచివాలయంలో సమీక్ష చేపట్టారు. సీఎస్ కేలక ప్రకటన చేశారు. తన పర్యటనలో భాగంగా ఏపీలోని చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు ఈనెల 24న శనివారం పర్యటించన్నారు. జిల్లాలోని నగరిలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నగరిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడ్ వెల్లడించారు. పట్టణంలో జరిగే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
భారీ ఎత్తున పోలీస్ భద్రతా చర్యలు చేపట్టామన్నారు ఎస్పీ. ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్
సుమిత్ కుమార్, నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొని ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్ ప్రాంతం, బహిరంగ సభా ప్రాంగణం, స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర జరుగు ప్రదేశాలు వంటి కీలక ప్రదేశాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు, అగ్ని మాపక చర్యలు, బారికేడింగ్, వైద్య సేవల సమకూర్పు, రూట్ మ్యాప్ లభ్యత, ట్రాఫిక్ నియంత్రణ, జనసామూహిక నియంత్రణ చర్యలపై పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ అవసరమైన సూచనలు ఇచ్చారు.


















