అమరావతి : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రేదశ్ రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చేలా రాజ ముద్రతో పట్టేదారు పాసు పుస్తకాలను ఇవ్వడం జరుగుతోందని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మీ భూమి మీ హక్కు అని , దానిని పొందేందుకు, లేదా ఆక్రమించేందుకు ఎవరికీ హక్కు లేదన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రాజ ముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతుల భూములకు భరోసా ఇచ్చేందుకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ఒకవేళ రీ-సర్వేలో తప్పులుంటే అధికారులపై చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని, పెత్తనం భరించాల్సిన అవసరం లేనే లేదని స్పష్టం చేశారు.
వివాదాలు సృష్టించే ప్రభుత్వం కాదని చెప్పారు. ఇది పరిష్కరించే సర్కార్ అని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. టెక్నాలజీతో ట్యాంపరింగ్ ఫ్రీ డాక్యుమెంట్లు ఇస్తున్నామన్నారు. దీని కారణంగగా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఎవరూ మీ భూములను లాక్కోలేరని, రికార్డులు తారుమారు చేయలేరని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు వివాదాల్లేని క్లీన్ డాక్యుమెంట్లు ఇచ్చే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఆ దిశగానే భూముల రీ-సర్వే చేపడుతున్నామని సీఎం వెల్లడించారు.
