తోతాపూరి మామిడి రైతుల‌కు స‌ర్కార్ భ‌రోసా

ఆదుకోవాల‌ని కేంద్రాన్ని కోరిన సీఎం చంద్రబాబు

hellotelugu-TotapuriMangos

అమ‌రావ‌తి : ఏపీ సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దేశంలోనే అత్య‌ధికంగా తోతాపురి మామిడి పండ్లు ఏపీ నుంచే వ‌స్తాయ‌ని కానీ మ‌ద్ద‌తు ధ‌ర విష‌యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ పాటిల్ కు లేఖ రాశారు. వెంట‌నే త‌క్ష‌ణ సాయంగా రూ. 200 కోట్లు విడుద‌ల చేయాల‌ని కోరారు సీఎం. గ‌త ఏడాది లానే తోతాపూరు మామిడి రైతుల‌కు కేజీకి 4 రూ ప్ర‌భుత్వం అంద‌చేస్తుంద‌ని తెలిపారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా రైతులకు ఇచ్చిన హ‌మీ ప్ర‌కారం ఏడాదికి మూడు విడ‌తల్లో అన్న‌దాత సుఖీభ‌వ నిధుల‌ను ఇచ్చామ‌ని చెప్పారు. ఈ ఏడాది కూడా తొలి విడ‌త‌గా న‌గ‌దును రైతుల ఖాతాల్లో వేసామ‌ని గుర్తు చేశారు. 2025–26 సంవత్సరానికి ప్రభుత్వం రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినప్పటికీ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.588 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

గ‌త వైసీపీ ప్ర‌భ‌త్వంలో ఐదేళ్లు రూ.2,140 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం రూ.1,475 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ.7,700 కోట్లు ఖర్చు చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ప్రజలను అప్పుల భారంలో ముంచిన జగన్‌కు రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మండిప‌డ్డారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు విలువ ఆధారిత పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే రాష్ట్ర వ్యవసాయం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Exit mobile version