Ex Minister Chidambaram Shocking Comments : జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌పై చిదంబ‌రం షాకింగ్ కామెంట్స్

ఎనిమిది సంవ‌త్స‌రాల కిందటే చేయాల్సి ఉంది

Hello Telugu - Ex Minister Chidambaram Shocking Comments

Hello Telugu - Ex Minister Chidambaram Shocking Comments

Chidambaram : ఢిల్లీ – కేంద్ర స‌ర్కార్ జీఎస్టీ కి సంబంధించి కీల‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకోవ‌డం ప‌ట్ల తీవ్రంగా స్పందించారు మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రం (Chidambaram). గ‌తంలో నాలుగు స్లాబ్ లుగా నిర్ణ‌యించిన కేంద్ర ఆర్తిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఉన్న‌ట్టుండి గ‌త్యంత‌రం లేక దేశ వ్యాప్తంగా జీఎస్టీ ప‌న్నుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం కావ‌డంతో రెండు స్లాబ్ రేట్ల‌కు ప‌రిమితం చేసింది. ఇందులో ఒక‌టి 5 శాతం కాగా రెండోది 18 శాతంగా ఉంది. ఈ సంద‌ర్బంగా చిదంబ‌రం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని కానీ ఈ నిర్ణ‌యం , ఈ ముందు చూపు 8 సంవ‌త్స‌రాల కంటే ముందే తీసుకుని ఉంటే బావుండేద‌న్నారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుక‌ని స్లాబ్ రేట్స్ తీసుకు వ‌చ్చారంటూ ప్ర‌శ్నించారు. కేంద్ర స‌ర్కార్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల వ‌ల్ల దేశంలోని కోట్లాది మంది పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయినా మోదీ స్పందించ లేద‌న్నారు.

Ex Union Minister Chidambaram Shocking Comments on GST Reforms

ఆనాటి నుంచి నేటి దాకా ప్ర‌తిప‌క్షాలు నెత్తీ నోరు మొత్తుకుంటున్నా ప‌ట్టించు కోలేదంటూ మండిప‌డ్డారు చిదంబ‌రం. దేశంలో అవినీతిని నిర్మూలిస్తామ‌ని ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల‌ను మోసం చేసి ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన మోదీ ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఏం సాధించిందో చెప్పాల‌న్నారు . ప్ర‌తిప‌క్షాలు లేవ‌దీసిన ప్ర‌శ్న‌ల‌కు ప‌ట్టంచు కోలేద‌న్నారు. ఈ నిర్ణ‌యం ఎప్పుడో తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు. ఈ స‌మ‌యంలో ఆర్థిక మంత్రిగా ఏం వెల‌గ‌బెట్టారో దేశానికి చెప్పాల్సిన బాధ్య‌త నిర్మ‌లా సీతారామ‌న్ పై ఉంద‌న్నారు. ప్రభుత్వం మార్పులు చేయడానికి కారణమేమిటో ఊహించడం ఆసక్తికరంగా ఉంటుందన్నారు. మందగమన వృద్ధి? పెరుగుతున్న గృహ రుణం? తగ్గుతున్న గృహ పొదుపులు? బీహార్‌లో ఎన్నికలు? మిస్టర్ ట్రంప్ విధించిన‌ సుంకాలన్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవస‌రం ఉంద‌న్నారు.

Also Read : Russia-Ukraine War Sensational : ఉక్రెయిన్ పై దాడులు ఆప‌ని ర‌ష్యా

Exit mobile version