Russia : అమెరికా హెచ్చరించినా, ట్రంప్ చర్చలు జరిపినా ఎక్కడా తగ్గడం లేదు రష్యా. ఏకపక్షంగా దాడులకు దిగుతోందని, ఆగడం లేదంటూ వాపోయారు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా దాడి చేసి ఇవాల్టితో మూడు సంవత్సరాలు పూర్తయ్యాయని అన్నారు. దాడుల కారణంగా మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇంధన సౌకర్యాలు ప్రధాన రష్యన్ (Russia) లక్ష్యంగా చేసుకుందన్నారు. ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని ఎలీసీ ప్యాలెస్‌లో జరిగిన సమావేశానికి ముందు పాత్రికేయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటి వరకు రష్యా ఏకపక్షంగా దాడులకు దిగిందని, 500కు పైగా డ్రోన్లు, 12కు పైగా మిస్సైల్స్ ను ప్రయోగించిందని ఆరోపించారు. అటు యూరోపియన్ యూనియన్ ఇటు అమెరికా చేసిన విన్నపాలను రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ పట్టించు కోలేదని వాపోయారు.
Russia-Ukraine War Updates
అయినా ఇప్పటి వరకు రష్యా చేసిన అన్ని దాడులను సమర్థవంతంగా తిప్పి కొట్టామని చెప్పారు జెలెన్ స్కీ. ఓ వైపు భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారని అయినా వర్కవుట్ కాలేదన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ససేమిరా అన్నారని మండిపడ్డారు. ప్రధానంగా రాత్రిపూట యుద్దం చేయకూడదని, దాడులకు పాల్పడ కూడదని నియమం ఉందని, కానీ వాటన్నింటిని పూర్తిగా పక్కన పెట్టారంటూ ధ్వజమెత్తారు. తమ దేశానికి ఆయువు పట్టుగా ఉన్న ఆయిల్ నిల్వలను నామ రూపాలు లేకుండా చేయాలని చూస్తోందని, ఆ దిశగానే దాడులకు తెగబడిందని ఆరోపించారు జెలెన్ స్కీ. ఈ దాడులు ప్రధానంగా పశ్చిమ, మధ్య ఉక్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పారు. రష్యా వైమానిక దాడులకు పాల్పడిందన్నారు.
Also Read : Popular Cricketer Sanju Samson : వచ్చే ఐపీఎల్ లో సంజూ శాంసన్ ఎటు వైపు..?
