హైదరాబాద్ : మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్ తో ఆదివారం చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా తన మనసులోని మాటను బయట పెట్టారు. రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడుందని ప్రశ్నించారు. ఉంటే చూపించాలని ఆయన నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతోందని ఆరోపించారు. ఇది తెలంగాణ ప్రజలకు మంచిది కాదన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సీరియస్ అయ్యారు. తను షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు టి. జీవన్ రెడ్డి. ప్రజలు గమనిస్తున్నారని, తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో సీఎం ఎ. రేవంత్ రెడ్డి నడుస్తున్నాడని ఆరోపించారు మాజీ మంత్రి. తెలంగాణలో ఆంధ్రా అధికారుల పెత్తనం ఏమిటని భగ్గుమన్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని పైర్ అయ్యారు. చంద్రబాబు మెప్పు పొందడానికే రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయకుండా తెలంగాణ ప్రజలను వంచిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ నినో ప్రభావం పడితే, కరువు వస్తే, మేడిగడ్డ లేని లోటు ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరు అని హెచ్చరించారు.


















