హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఏపీకి తాకట్టు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెర తీశాడని, తన గురువు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మంత్రులందరినీ పండబెట్టిండని, ఏ శాఖలో ఏం జరుగుతుందో కూడా మంత్రులకు తెలియడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు పిటిషన్ రేవంత్ రెడ్డికి ఇస్తే, ఆయన అధికారులకు ఇచ్చి కోర్టుకు పంపి ఉండొచ్చు.. ఈ పిటిషన్ కూడా ఉత్తమ్ చదవలేదు ఏమో అంటూ ఎద్దేవా చేశారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబసభ్యులే దందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.. మమ్మల్నేం బ్రతకనిస్తలేడు అని అందరు మంత్రులు ఏడుస్తున్నారంటూ ఇక ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తారని అన్నారు హరీశ్ రావు.
తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌కు అర్హతే లేదని సుప్రీంకోర్టు మొహం మీద కొట్టి పంపించిందని, అయినా సోయి లేకుండా మాట్లాడటం దారుణమన్నారు . ఇకనైనా కాస్తంత అవగాహన కలిగి ఉంటే మంచిదన్నారు. చంద్రబాబు డైరక్షన్ లో నే రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడని ఆరోపించారు హరీశ్ రావు . మెరిట్స్ మీద తీర్పులు, తీర్మానాలు వస్తాయి కానీ అసలు పిటిషనే చెల్లదు అంటే ఎంత బలహీనంగా ఉన్నట్లు అని అన్నారు. లాయర్ మనం చెప్పింది వాదిస్తాడని, ఆయనది ఇందులో తప్పేమీ లేదన్నారు . ఇది ముమ్మాటికి కావాలనే చంద్రబాబు నాయుడుకు సమయం ఇవ్వాలని బలహీన, తప్పుడు పిటిషన్ వేశారని ఆరోపించారు. పోలవరం – నల్లమల సాగర్‌కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న రేవంత్ నిజస్వరూపం, ద్రోహ బుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని అన్నారు .















