అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు ప్రముఖ ఆంట్రప్రెన్యూర్, కోచ్, మెంటార్ శ్రీధర్ బెవరా. అమరావతిలో జరిగిన క్వాంటం ఫ్రాంటియర్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎంను కలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు. ఆవిష్కరణలు, పెట్టుబడులు, భవిష్యత్-సిద్ధమైన పాలనపై అసాధారణమైన స్పష్టత కలిగిన నాయకుడంటూ చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. తనను వ్యక్తిగతంగా కలుసు కోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ అదృష్టం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు శ్రీధర్ బెవెరా.
ఆయన తేజస్సు, పట్టుదల, అభిరుచి, శక్తి, వివేకం, సహకారం, సామాన్య ప్రజల శ్రేయస్సు కోసం ఉమ్మడి లక్ష్యాన్ని సృష్టించే కళకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈయన ఆ రోజుకు అవసరమైనది చేయడం ద్వారా కాకుండా, దశాబ్దాల ముందుగానే ఆలోచించడం ద్వారా తన ప్రాసంగికతను నిలుపుకున్నారంటూ కితాఉ ఇచ్చారు. ఒకనాడు వీధుల్లో హెరిటేజ్ పాల ప్యాకెట్లు అమ్మడం, వెయిటర్‌గా పని చేయడం నుండి ఇప్పుడు బోర్డురూమ్‌లకు నాయకత్వం వహించడం వరకు తన ప్రయాణాన్ని సీఎంతో పంచుకున్నట్లు తెలిపారు శ్రీధర్ బెవెరా.
పుంజుకోవడం, పరివర్తన కథలపై ఆయనకున్న అపారమైన ఆసక్తిని, ఇంకా అలాంటి మరెన్నో ప్రయాణాలకు వీలు కల్పించాలనే దార్శనికతను చూడటం ప్రోత్సాహకరంగా ఉందన్నారు. అవకాశాల కేంద్రంగా అమరావతి, ఆంధ్రప్రదేశ్ పట్ల తమ ఉమ్మడి నిబద్ధతను మా సంభాషణ ప్రతిబింబించిందని తెలిపారు. ఆయన నాయకత్వాన్ని, ఉమ్మడి దార్శనికతను ప్రోత్సహించడానికి, అలాగే భారతదేశం నలుమూలల నుండి , వెలుపల నుండి ప్రతిభను, ఆలోచనలను, పెట్టుబడులను ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం గొప్పదన్నారు.
















