న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నిప్పులు చెరిగారు కేంద్ర సర్కార్ నిర్వాకంపై. తాను తెల్లవారుజామున 2 గంటల తర్వాత జాతీయ రాజధానికి తిరిగి వచ్చాను. కానీ ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటు వంటి దృశ్యాలను నేను చాలా అరుదుగా చూశాను. ప్రతి కొన్ని వందల మీటర్లకు చెక్‌పోస్టులు, రోడ్లకు అడ్డంగా వేసిన కాంక్రీట్ బారికేడ్లు, స్పైక్ స్ట్రిప్‌లు, నగరం అంతటా యుద్ధ తరహాలో 22,000 మంది పోలీసులు , పారా మిలిటరీ బలగాలను మోహరించడం, 250 రైళ్లను రద్దు చేయడం, 45 మెట్రో స్టేషన్లను మూసి వేయడం దారుణమన్నారు ఎంపీ. రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో యువకులను వారి సొంత ఇళ్ల నుండి, వీధుల నుండి నిర్బంధించం అప్రజాస్వామికమని పేర్కొన్నారు . ఇవన్నీ మన ఎన్నికల సమగ్రతపై పౌరులు శాంతియుతంగా ప్రశ్నలు లేవనెత్తకుండా నిరోధించడానికే జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రాజధాని నడిబొడ్డున ఇంటర్నెట్‌ను నిలిపి వేయడం అత్యంత తిరోగమన (అలాగే అణచివేత) చర్య అని మండిపడ్డారు.
సంచార స్వేచ్ఛ పూర్తిగా సంకెళ్లతో బంధించ బడిందని ఇది కేంద్ర సర్కార్ కు తగదన్నారు. ఢిల్లీ నగర కేంద్రంలో పౌరులు తమ అసమ్మతిని వ్యక్తం చేయడానికే జంతర్ మంతర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు ఎంపీ. కానీ ఈ రోజు దానికి దారితీసే రోడ్లను కూడా నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు శశి థరూర్. రాజధానిలో మహిళలకు రక్షణ అవసరమైనప్పుడు ఈ అసాధారణమైన మానవశక్తి, ఈ తక్షణ చర్య ఎక్కడికి మాయమవుతాయని ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉందని ప్రశ్నించారు ప్రధాని మోదీని. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు సోమవారం తిరిగి వస్తే అధికారులు జాతీయ రాజధానిని మళ్లీ దిగ్బంధిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘంపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి బారికేడ్లు ఏమీ చేయలేవని అన్నారు. అది ప్రజల ప్రశ్నలకు ఎంత త్వరగా సమాధానమిస్తే, అంత త్వరగా శాంతి పునరుద్ధరించ బడుతుందని గుర్తించాలన్నారు. ఒక ప్రజాస్వామ్యం బలం, దాని పనితీరును ప్రశ్నించే వారిని అది ఎలా చూస్తుందనే దానిపై కొలవబడుతుందే తప్పా మరోటి కాదన్నారు.
