న్యూఢిల్లీ : సామాన్యులకు, ఆభరణాల ప్రియులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్రంలోని బీజేపీ సర్కార్.
వెండి, బంగారం, ప్లాటినంపై దిగుమతి సుంకం రెట్టింపు చేసింది. 5 శాతంగా ఉన్న సుంకాన్ని 10 శాతంగా పెంచడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది కస్టమ్స్ డ్యూటీ అని పేర్కొంది. కేంద్రం నిర్ణయంతో మరింత పెరగనున్నాయి వెండి, బంగారం ధరలు. ఇదిలా ఉండగా హైదరాబాద్ వేదికగా జరిగిన బహిరంగ సభలో బంగారం కొనొద్దని ఇటీవలే కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాగా 2025-26లో రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు చేసుకున్నారు.
2025-26లో రికార్డు స్థాయిలో 71.98 డాలర్లకు చేరింది బంగారం దిగుమతులు. ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద బంగారం వినియోగం దేశంగా భారత్ నిలిచింది. తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులకు అదనపు భారం కానుంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది పసిడి, వెండి. ప్రస్తుతం కేబినెట్ సమావేశం అయ్యింది. ప్రధానంగా చోటు చేసుకున్న యుద్దం గురించి చర్చ జరగనుంది. ఇంధన వినియోగంపై వీలైనంత మేరకు ఖర్చు తగ్గించు కోవడం సహా ప్రయాణాలు సమావేశాలు, సమీక్షా సమావేశాలు అవకాశం వున్న మేరకు వర్చువల్ మోడ్ లోనే నిర్వహించుకోవాలని సూచనలు చేశారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం వున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నెలకు 30 వేట్ల కోట్లు నష్టాలు వచ్చయని పేర్కొంది కేంద్ర సర్కార్. కాగా నష్టాలను కంపెనీలు ఎంతో కాలం భరించలేవని నిన్న వ్యాఖ్యానించారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి .
