Centre Banned : ఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా అశ్లీల కంటెంట్ ను విచ్చలవిడిగా ప్రసారం చేస్తున్న 25 ఓటీటీ సంస్థలపై వేటు వేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సంస్థల వివరాలను కూడా వెల్లడించింది. గతంలో పలుమార్లు హెచ్చరించినా సదరు సంస్థలు పట్టించు కోలేదని, అదే పనిగా అశ్లీల కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తూ వచ్చాయని అందుకే బ్యాన్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. భారతీయ చట్టంలోని బహుళ నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపింది.
Centre Banned 25 OTT Platforms
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) అశ్లీల, అసభ్యకరమైన కొన్ని సందర్భాల్లో, అశ్లీల విషయాలను ప్రచురించినందుకు 25 ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఆయా సంస్థల వివరాలను కూడా ప్రకటించింది. నిషేధానికి గురైన వాటిలో ఆల్ట్ బాలాజీ (ఏఎల్టీటీ) , ఉల్లు, బిగ్ షాట్స్ యాప్, డెసిఫ్లిక్స్, బూమెక్స్, నియాన్ ఎక్స్ వీఐపీ, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్ , బుల్ యాప్ , షోహిట్ , జల్వా యాప్ , వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, హిట్‌ప్రైమ్,
ఫుగి, ఫీనియా, షోఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్ఎక్స్ VIP, హల్చుల్ యాప్, మూడ్‌ఎక్స్, ట్రిపుల్ ఎక్స్ , మోజ్ ఫ్లిక్స్ ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ ఫారమ్ లలో చాలా కంటెంట్ నగ్నత్వం, అశ్లీల దృశ్యాలను కలిగి ఉండడంతో వీటిని నిషేధించినట్లు స్పష్టం చేసింది కేంద్రం.
Also Read : Bhumana Karunakar Reddy Strong Demand : తిరుపతి తొక్కిసలాటపై సీబీఐతో విచారణ చేపట్టాలి
